అవంతి కళాశాలలో జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు
భోగాపురం, (మేజర్ న్యూస్): అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు నవంబర్ 14 వ తేది నుండి 20వ తేది వరకు నిర్వహిస్తున్నారు. భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి విశేష సేవలందించిన డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాలు ప్రాముఖ్యత, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని విస్తరింపచేయడం, ఆధునిక డిజిటల్ వనరులను సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. లైబ్రరీ అనేది జ్ఞానానికి నిలయం. ఇది మనలో ఆలోచన శక్తిని మరియు అవగాహనను పెంపొందిస్తుంది, మంచి పుస్తకాలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి, అనేక నైపుణ్యాలను పెంపొందిస్తాయి, విద్యార్థులందరికీ లైబ్రరీ ఒక వరప్రసాదం. ఇది వారి చదువు, పరిశోధనకు బలమైన పునాదివంటివని, పుస్తకాలు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయని, విద్యార్థులు తమ విద్యాభ్యాసంతో పాటు పరిశోధన, పోటీ పరీక్షలు మరియు వ్యక్తిగత అభివృద్ధికి గ్రంథాలయ వనరులను విస్తృతంగా వినియోగించుకోవాలని అలాగే విద్యార్థుల విద్యా వికాసంలో గ్రంథాలయాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రంథాలయాలు సమాజానికి దిక్సూచి వంటివని కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. మురళీకృష్ణ, డైరెక్టర్ డా. ఎ. చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమములో జె.ఆర్.జి. పట్నాయక్, అధ్యాపకులు, గ్రంథాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్: వై శ్రీనివాస్, భోగాపురం.