BREAKING
బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం పినిపే విశ్వరూప్ గారికి ఘనంగా జన్మదిన వేడుకలు డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి.. భవిష్యత్తును కాపాడుకోండి.. ఎస్సై లక్ష్మణ్ రావు పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తు.. చంద్రబాబు కే సాద్యం దసరా ఉత్సవాలకు గోడ పత్రికను ఆవిష్కరించనున్న వేణుగోపాల్ రెడ్డి! జిల్లా పోలీస్ శాఖకు రెండు బ్రెత్ అనలైజర్ (డ్రంకెన్ డ్రైవ్ మెషిన్)లను డొనేట్ చేసిన హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ కెసిఆర్ కేటీఆర్ లపై వ్యక్తిగత విమర్శలే.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక... బొడ్డెమ్మ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు బాధాకరం.. సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి అచ్చెన్నాయుడు రెండోసారి డిస్కవర్ అనంతపురానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రామగుండం మెగా కోల్ మైన్ కు ఈసీ క్లియరెన్స్...మరో 20 ఏళ్ళ పాటు పెరిగిన జీవితకాలం కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ కు 100 కోట్లు కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ బుగ్గారం అంగన్వాడి కేంద్రంలో సిలిండర్ లీకై చెలరేగిన మంటలు

అన్ని పాఠశాలల్లో ప్రశాంతంగా ముగిసిన ఎస్ ఎం సిఎన్నికలు మండల విద్యాశాఖాధికారి

Select Suryaa Now
అన్ని పాఠశాలల్లో ప్రశాంతంగా ముగిసిన ఎస్ ఎం సిఎన్నికలు  మండల విద్యాశాఖాధికారి

వింజమూరు మేజర్ న్యూస్  :  వింజమూరుమండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ ఎం సి)ఎన్నికలు నిబంధనల ప్రకారం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసినట్లు ఎంఈఓ పి రమేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది సమన్వయంతో ఎన్నికలను సజావుగా నిర్వహించారు.
ఎన్నికైన ఎస్ఎంసి సభ్యులు పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదల, పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాల్లో పాఠశాల యాజమాన్యంతో సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు.  ఎస్ ఎం సిఎన్నికల నిర్వహణకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎన్నికల సిబ్బంది మరియు సంబంధిత అధికారులకు విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.