BREAKING
స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు బాధాకరం.. సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

Select Suryaa Now
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు బాధాకరం.. సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి:స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించేలా హైకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్లు కేవలం రక్షణ మాత్రమే కాదని, అది వారి రాజ్యాంగబద్ధమైన రాజకీయ హక్కు అని ఆయన స్పష్టం చేశారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చట్టపరంగా ముందడుగు వేస్తామని, బీసీల హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి, వారి ఆర్థిక-సామాజిక ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీయే నాటి నుంచి నేటి వరకు బలమైన పునాది వేసిందని గుర్తుచేశారు.

ఈ న్యాయపోరాటంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ న్యాయస్థానాల్లో ప్రతికూల ఫలితం వచ్చినా, రాజకీయంగా తమ పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ తరఫునే రాబోయే ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రాజకీయ అవకాశాలు మరియు టికెట్లు కల్పించి తీరుతామని ఆయన ప్రకటించారు.