అనంతపురం కార్పొరేషన్ ఎన్నికలు.. మేయర్‌కు 16 మంది, వార్డులకు 447 నామినేషన్లు..
(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మేయర్ పదవికి ఒక్క నామినేషన్ కూడా ఉపసంహరణ కాలేదు. దీంతో 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 62 డివిజన్ల వార్డు సభ్యుల పదవులకు 12 నామినేషన్లు ఉపసంహరించుకోగా, ప్రస్తుతం 447 నామినేషన్లు మిగిలాయి. ఉపసంహరణల్లో టీడీపీ నుంచి 10, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థి నుంచి ఒక నామినేషన్ ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి ఎం. జశ్వంత్ రావు అధికారులకు సూచించారు.