BREAKING
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ మార్కెట్లోకి విడుదల: ₹16.99 లక్షల ప్రారంభ ధర.. మైలేజ్, ఫీచర్లు మరియు పూర్తి వివరాలివే! పురుగుల మందు తాగి వ్యక్తి మృతి* పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్ సీపీ పార్టీ చైర్మన్ అభ్యర్థి తూముల రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు

అనంతలో కూటమి బలప్రదర్శన.

Select Suryaa Now
అనంతలో కూటమి బలప్రదర్శన.

అనంతపురం కలెక్టరేట్ రిపోర్టర్ వేణుగోపాల్…

అనంతలో కూటమి బలప్రదర్శన.. బీజేపీ మేయర్ అభ్యర్థిగా అజేష్ యాదవ్ నామినేషన్

అనంతలో కూటమి బలప్రదర్శన.. బీజేపీ మేయర్ అభ్యర్థిగా అజేష్ యాదవ్ నామినేషన్

భారీ ర్యాలీతో హోరెత్తిన అనంతపురం వీధులు.. మూడు పార్టీల నేతల ఐక్యతా ప్రదర్శన

అజేష్ గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల ప్రతిన

అనంతపురం: నగర మేయర్ అభ్యర్థిగా బీజేపీకి చెందిన అజేష్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో అనంతపురం నగర వీధులు కూటమి జెండాలు, నినాదాలతో మార్మోగాయి. కోర్టు రోడ్డు నుంచి టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కూటమి ముఖ్య నాయకులు పాల్గొని అజేష్ యాదవ్‌కు మద్దతు ప్రకటించారు.

మూడు పార్టీల నాయకులు మాట్లాడుతూ అజేష్ యాదవ్ గెలుపు కోసం సమష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల విజయాన్ని మించి మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థికి ప్రజల మద్దతు ఉందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు.

కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి భారీ ర్యాలీతో సమాధానం చెప్పామని అజేష్ యాదవ్ పేర్కొన్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నగర ప్రజల సహకారంతో అనంతపురం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.