BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

అనపర్తిలో అండర్‌-14 జిల్లా స్థాయి వాలీబాల్‌ సెలెక్షన్స్.

Select Suryaa Now
అనపర్తిలో అండర్‌-14 జిల్లా స్థాయి వాలీబాల్‌ సెలెక్షన్స్.

అనపర్తి, మేజర్ న్యూస్  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్‌-14 బాలబాలికల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి వాలీబాల్‌ జట్ల ఎంపిక పోటీలు సోమవారం అనపర్తిలోని శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి-2 నల్లమిల్లి సత్తిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులగం వెంకటరెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ  చైర్మన్ మల్లిడి పార్వతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

 వీరితో పాటు ఎస్ జి ఎఫ్  కార్యదర్శులు వి. శ్రీనివాస్, కె. గణేష్, సెక్రటరీ అడ్మిన్ అన్నపూర్ణ, ఉషారాణి పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఈ జిల్లా స్థాయి సెలెక్షన్స్‌లో మొత్తం 280 మంది బాలబాలికలు, 60 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడాకారుల ప్రతిభ, ఆటతీరు, నైపుణ్యాలను పరిశీలించి ప్రతిభావంతులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు.

 ఇక్కడ ఎంపికైన అండర్‌-14 బాలబాలికల జట్లు ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పాడేరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున పాల్గొంటాయని సెలెక్షన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అనపర్తి బాలుర ఉన్నత పాఠశాల పీడీ టి.వి.వి.ఎస్. రాఘవరెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు ఆతిథ్యం కల్పించిన అనపర్తి పాఠశాల యాజమాన్యాన్ని, సహకరించిన ఉపాధ్యాయులను నిర్వాహకులు అభినందించారు.