అంతర్జాతీయ సదస్సులో ఎస్వీయూ ప్రొఫెసర్ ప్రసంగం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి దేవప్రసాద్ రాజు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ లో జరుగుతున్న 7వ ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ ఆన్ ఆప్టిక్స్, ఫోటోమిక్స్ అండ్ లేజర్ (ఓపీఎల్-2026) సదస్సులో బుధవారం పరిశోధన ప్రసంగాన్ని అందించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు యునైటెడ్ సైంటిఫిక్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ బి దేవప్రసాద్ రాజు తన ప్రసంగంతో పాటు లుమ్యినేషన్స్ ఇన్వేస్టిగేషన్స్ అండ్ గెయిన్ క్రాస్ సెక్షన్ ప్రొఫైల్స్ ఆఫ్ ఇర్బుయం డిపెడ్ బోరో టెల్యూరేట్ గ్లాసెస్ ఫర్ సీ బ్యాండ్ టెలీకమ్యూనికేషన్స్ అనే అంశంపై పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆయన సమర్పించిన పరిశోధన అంతర్జాతీయ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆప్టిక్స్, ఫోటానిక్స్ మరియు లేజర్ రంగాల్లో ఎస్వీయూ పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పింది. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజును అభినందించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్