అంతర్గత ఒప్పందాలా.. ఎవరికి శఠగోపం?
సీతానగరం, సూర్య : సీతానగరం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక, పోటీ విషయంలో ప్రధాన పార్టీల మధ్య అంతర్గత ఒప్పందాలు చోటుచేసుకున్నాయా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలవగా, ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ మధ్య పోటీ నెలకొంది.కాంగ్రెస్ పార్టీల నామ మాత్రమే. మరోవైపు ఎంపీటీసీ స్థానాల విషయంలో మాత్రం పోటీ రసవత్తరంగా మారింది. మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 40 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో గ్రామాల్లో రాజకీయ వేడి పెరిగింది. జడ్పీటీసీ ఎన్నికల్లో కనిపిస్తున్న రాజకీయ సమీకరణాలు, ఎంపీటీసీ ఎన్నికల్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో అంతర్గత ఒప్పందాల వెనుక అసలు వ్యూహం ఏమిటి? చివరకు ఎవరికి రాజకీయంగా శఠగోపం ఎదురవుతుందన్నది వేచి చూడాల్సిందే