అమరావతిలో మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం.. పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం బ్యూరో : రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహచర మంత్రివర్గ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
రాష్ట్రానికి సంబంధించిన వివిధ పరిపాలనా, అభివృద్ధి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు అధికారికంగా వెల్లడించారు. మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశానికి హాజరై ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు.