BREAKING
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం జనసేనలోకి భారీగా చేరికలు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్... కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం. బాహుబలి కిలికిలి భాషను మించేలా.. రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో మరో కొత్త భాష! అంతర్యుద్ధ శిథిలాల నుంచి సిరియా పర్యాటక రంగ పునరుజ్జీవనం విద్యా వ్యవస్థ ప్రక్షాళన... బలోపేతానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అమీనాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కెనడా వాణిజ్య విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా వేల్పూర్ లోఇందిరమ్మ గృహప్రవేశం నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే.. వృద్ధాశ్రమంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అన్నదానం

అమరావతి ఓఆర్ఆర్ కు పూర్తి సహకారం అందించండి పోలవరం వద్ద ఐకానిక్ వంతెన ప్రాజెక్టు చేపట్టండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

Select Suryaa Now
అమరావతి ఓఆర్ఆర్ కు పూర్తి సహకారం అందించండి  పోలవరం వద్ద ఐకానిక్ వంతెన ప్రాజెక్టు చేపట్టండి  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ రాజధాని ప్రాంత అభివృద్దికి అత్యంత కీలకం అవుతుందని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై విజ్ఞాపన పత్రాన్ని అందించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ వాటికి కేంద్రం నుంచి ఆమోదాలు, నిధులు, అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర తీర ప్రాంత అభివృద్ధితో పాటు కనెక్టివిటీ పెంచేందుకు దోహదపడే బీచ్‌ రోడ్డు ప్రాజెక్టుపైనా దృష్టి సారించాలన్నారు. తీరప్రాంతంలోని నగరాలు, పర్యాటక ప్రాంతాలు, పోర్టులు, పారిశ్రామిక కేంద్రాల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించేందుకు బీచ్ రోడ్ ఉపయోగపడుతుందని సిఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎడమ, కుడి గట్లను కలిపేలా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సహకారం అందించాలని సీఎం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ప్రాజెక్టుకు అనుబంధంగా అవసరమైన రహదారి, వంతెనల నిర్మాణానికి సహకరించాలని కోరారు.