BREAKING
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారుల సమీక్ష మరియు షెడ్యూల్ విడుదల ఓటమి భయంతోనే పత్రాలు చింపేస్తున్నారు - వైసిపి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి దుర్గాభవాని మాత మాలదారుల పాదయాత్ర రాజరాజేశ్వరి దేవిగా మైసమ్మ తల్లి దర్శనం బద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై టీడీపీ శ్రేణుల దాడి? గెలుపే లక్ష్యంగా కూటమి వ్యూహరచన -స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేలా సన్నాహక భేటీ -ప్రచారం, సమన్వయం, క్షేత్రస్థాయి వ్యూహంపై కూటమి నేతల సుదీర్ఘ మంతనాలు -తిరుపతి నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు కీలకం : కూటమి నేతలు గాజుల శ్రీరాములు తల్లికి ఎమ్మెల్యే అమిలినేని నివాళులు కంబదూరు మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.. ప్రగాఢ సానుభూతి ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్'.. ఆహాలో స్ట్రీమింగ్! ప్రజావాణిలో 49 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దీపక్ తివారి మహిషాసురవర్ధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు కిరణ్ కు మంత్రి టీజీ భరత్ నివాళులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మేకల కాపరులపై బీట్ అధికారి దాడి! టీడీపీ ఖాతాలోకి గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి నెల్లూరు కార్పొరేషన్ స్క్రూటినీలో కీలక మార్పులు!

అమలాపురం మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్: చైర్మన్ అభ్యర్థి ముషిణి మణికి 'బి' ఫారం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్!

Select Suryaa Now
 అమలాపురం మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్: చైర్మన్ అభ్యర్థి ముషిణి మణికి 'బి' ఫారం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్!

సూర్య లోకల్ డెస్క్, అమలాపురం: స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసింది. అమలాపురం మున్సిపల్ చైర్మన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన శ్రీమతి ముషిణి ఎస్. కె. ఎన్. మణి గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీ కొత్తూరి శ్రీనివాస్ నేడు అధికారికంగా "బి" ఫారం  అందజేశారు.

అమలాపురంలో కాంగ్రెస్ శ్రేణుల సందడి:
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ముషిణి మణి గారికి బీ-ఫారం అందజేస్తూ, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని కొత్తూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అమలాపురం పట్టణ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తామని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. బీ-ఫారం అందుకున్న అనంతరం ముషిణి మణి పార్టీ అధిష్టానానికి, జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణ ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకపల్లి రాంబాబు ,స్థానిక కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.