అక్వాన్ తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం – ముందస్తు చర్యలు చేపట్టిన నెల్లూరు విద్యుత్ శాఖ
అక్వాన్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, నెల్లూరు జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
APSPDCL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివ శంకర్ లోతేటి, IAS గారి ఆదేశాల మేరకు, నెల్లూరు జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. సుధాకర్ గారు జిల్లాలోని విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసి, తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
నెల్లూరు, మేజర్ న్యూస్ : అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు:
విద్యుత్ లైన్లపై పడే అవకాశం ఉన్న చెట్ల కొమ్మలను ముందుగానే తొలగించడం, లైన్ క్లియరెన్స్ పనులు చేపట్టడం.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే పునరుద్ధరణ చేపట్టేందుకు అవసరమైన సిబ్బందితో ప్రత్యేక బృందాలను సిద్ధం చేయడం.
విద్యుత్ స్తంభాల ఏర్పాటు, దెబ్బతిన్న స్తంభాల మార్పిడి కోసం అవసరమైన మాన్‌పవర్‌ను అందుబాటులో ఉంచడం.
అత్యవసరంగా విద్యుత్ స్తంభాల గుంతలు తవ్వేందుకు JCB యంత్రాలను సిద్ధంగా ఉంచడం.
విద్యుత్ స్తంభాలను నిలబెట్టేందుకు క్రేన్లు, ఇతర అవసరమైన వాహనాలను సిద్ధం చేయడం.
విద్యుత్ పునరుద్ధరణ పనులకు అవసరమైన పోల్స్, వైర్లు, ఇన్సులేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవడం.
నిరంతర పర్యవేక్షణతో క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం.
విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి:
తుపాను సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరిగినా లేదా సరఫరాలో అంతరాయం ఏర్పడినా వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించాలని కోరారు.
విద్యుత్ ఫిర్యాదుల కోసం సంప్రదించవలసిన నంబర్లు:
టోల్ ఫ్రీ నంబర్లు: 1912, 1800 425 155333
మన మిత్ర వాట్సాప్ నంబర్: 91333 31912
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, విద్యుత్ సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు APSPDCL యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. సుధాకర్ గారు తెలిపారు.