BREAKING
గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ .35 వేల వ్యాయంతో నిర్మాణం.. అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’ ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ‘ఇండి’ కూటమి ఎంపీల భారీ ర్యాలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సామ్ కోషి మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ ఆవరణలో ఘనంగా వరుణ జపాలు.. హోమాలు వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు ‎ చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు అనంతపురం జిల్లాలో వైద్య సేవలకు అంతరాయం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌.. విధులు బహిష్కరించిన వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు అస్సూరెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక ధర్నా నంద్యాలలో ఘనంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ -కూటమి ప్రభుత్వం లక్ష్యం సొంతింటి కల సాకారం-రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఫరూక్

అకాల వర్షానికి 100 ఎకరాల అరటిపంట నేలమట్టం

Select Suryaa Now
అకాల వర్షానికి 100 ఎకరాల అరటిపంట నేలమట్టం

లింగాల మేజర్ న్యూస్ : 
లింగాల మండల పరిధిలోని ఇంటేపల్లి గ్రామంలో సోమవారం రాత్రి వీచిన బలమైన గాలులు, కురిసిన అకాల వర్షానికి సుమారు 100 ఎకరాల అరటి పంట నేలమట్టమైంది. చేతికొచ్చిన పంట కళ్లెదుటే దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడి నెలకొనడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షం, ఈదురుగాలులు అరటి తోటలను పూర్తిగా దెబ్బతీయడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
లక్షల రూపాయలు అప్పులు చేసి అరటి సాగు చేశామని, పంట నష్టంతో తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.


పి కృష్ణ. పులివెందుల స్టాఫ్ రిపోర్టర్