BREAKING
మధ్యప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు డిసెంబర్ 31, 2029 నాటికల్లా లక్ష్యం గుజరాత్‌లో ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 20వ స్వర్ణం: రెజ్లింగ్‌లో మెరిసిన అమన్ రష్మిక వంట చేస్తే యుద్ధమే.. రణబాలి ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ సరదా కామెంట్స్ యూకే ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక కేంద్రంలో భద్రతా కలకలం 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు: ప్రభుత్వం భారీ ఏర్పాట్లు మధ్యశ్రేణి క్షిపణి పరీక్షను ధృవీకరించిన కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ రాయదుర్గం రూరల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై రష్యా క్షిపణి దాడి దేవర చుట్టమల్లే పాట మార్ఫింగ్ వివాదం.. తీవ్రంగా స్పందించిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ జర్మనీని వేధిస్తున్న వైమర్ కాలపు ముప్పు అమెరికా-రష్యా చర్చల్లో కోట్ల డొల్లర్ల భారీ చమురు ఒప్పందం ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. శ్రీరామ్, రంగాయణ రఘు చిత్రం ఎలా ఉందంటే? గాల్లోనే గొడ్డలితో దాడి, ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన యూఏఈ

ఐసిడిఎస్ వెల్దుర్తి పరిధిలో పోషణ మాసోత్సవం, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

Select Suryaa Now
ఐసిడిఎస్ వెల్దుర్తి పరిధిలో పోషణ మాసోత్సవం, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్  మండలంలోని తొమ్మిదవ అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ వెల్దుర్తి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ పద్మావతి నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మావతి తల్లులకు, గ్రామ ప్రజలకు పోషణ మాసోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. చిన్న పిల్లలకు పోషణ బాల్య ప్రేరణ ఎంతైనా అవసరమని, పిల్లలకు అనుబంధ పోషకాహారాన్ని ప్రేరణతో ఏ విధంగా అందించాలో స్పష్టంగా తెలిపారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల పోషకాహారం పునాది అని పేర్కొన్నారు.

అనంతరం ఐసిపిఎస్ (ICPS) యూనిట్ ప్రతినిధులు గీతావాణి, మౌనిక ఆధ్వర్యంలో 'బాల్య వివాహాల రహిత భారత్' (వివాహ శ్రీ విముక్త భారత్) ప్రచార కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గీతావాణి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు సమాజానికి శాపమని, చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయని హెచ్చరించారు. బాల్య వివాహాల వల్ల పుట్టబోయే బిడ్డలు అనారోగ్యానికి గురవుతారని, అంతేకాకుండా తల్లి, పిల్లల మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఆడపిల్లలకు తగిన స్వేచ్ఛ, గౌరవం ఇవ్వాలని, తల్లిదండ్రులు తమ పిల్ల పట్ల ప్రేమతో, శ్రద్ధగా వ్యవహరించాలని సూచించారు.

ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం హాజరైన తల్లులందరిచే బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు హెప్సిబా, విజయకుమారి, రేణుకతో పాటు అంగన్వాడీ హెల్పర్లు, స్థానిక ప్రజలు, తల్లులు విశేషంగా పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా