అధ్యాపకుడు గా మారిన రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం బ్యూరో: ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సందర్శించారు. ఈ సందర్భంగా బీకాం ప్రథమ సంవత్సరం విద్యార్థులతో కొద్దిసేపు మమేకమైన మంత్రి, తరగతి గదిలో అధ్యాపకుడిగా మారి పాఠ్యాంశాలతో పాటు జీవితానికి ఉపయోగపడే పలు విషయాలను వివరించారు.
లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. అవమానాలు, అపజయాలను అవకాశాలుగా మలుచుకుని విజయాన్ని సాధించాలని అన్నారు. గ్రామీణ విద్యార్థుల్లోనూ అపారమైన ప్రతిభ ఉందని, సరైన లక్ష్యంతో కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. కళాశాలలో తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.