అభివృద్ధి పనులపై ప్రత్యేక నిఘా
మండల ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్
బాడంగి, సెప్టెంబర్ 28 (మేజర్ న్యూస్): బాడంగి మండల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి ఎం. కిరణ్ కుమార్ సూచించారు. నూతనంగా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, కార్యాలయ సిబ్బంది, అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, పంచాయతీల పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు. గ్రామాల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పంచాయతీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీలత, డిప్యూటీ ఎంపీడీవోలు దేవకుమార్, బాల దొర, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు