BREAKING
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో నిరసన. యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

అభివృద్ధి అంటే ''సునీల్‌'' అంటే నమ్మకం - లోకల్‌ అంటే దోపిడీ కాదు నమ్మకం

Select Suryaa Now
అభివృద్ధి అంటే ''సునీల్‌'' అంటే నమ్మకం  - లోకల్‌ అంటే దోపిడీ కాదు నమ్మకం

గూడూరు, మేజర్‌న్యూస్‌  :     నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే... అభివృధ్ధి అంటే దోపిడీ కాదని విద్వంసం మాత్రమే తెలిసిన నాయకుల విమర్శలు సిగ్గు చేటని ఎంఎల్‌ఏ రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ పాశిం సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం గూడూరు పట్టణం నుంచి నెల్లూరు వైపు వేళ్లే పాత మద్రాస్‌ జాతీయ రహదారిపై పంబలేరు వంతెన వద్ద అనుసందాన రహదారుల నిర్మాణానాకి శంఖుస్థాపన చేశారు. 2014-19 మద్య కాలంలో తాను ఎంఎల్‌ఏగా శంఖుస్థాపన వంతెన నిర్మాణం పూర్తి చేసుకున్నా రెండు వైపుల అనుసందాన రహదారులు కూడ పూర్తి చేయలేని దౌర్భాగ్య ప్రభుత్వం మీదని విమర్శించారు. తిరిగి తామే వంతెన రహదారుల పూర్తి చేసేందుకు రూ.9.26 కోట్లతో మంజూరు చేయించి శంఖుస్థాపన చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల మీ ప్రభుత్వ పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమైనా చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 సమయంలో చేసిన అభివృద్ధి ఇపుడు తిరగి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధితో నియోజకవర్గం కొంత పుంతలు తొక్కుతోందని తెలిపారు. వైసిపి నాయకులు, సమన్వయకర్త తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేయడం కాదని అభివృద్ధి ఎపుడు జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. ఆరోపణలు చేసిన నాయకుడు స్వంత ప్రాంతంలో కూడ శంఖుస్థాపన చేసి వదిలేస్తే తామే ఆ పని పూర్తి చేయడం మరిచి పోవద్దన్నారు. దళితుల పేరుతో విద్యా సంస్థలు పెట్టి వారికే శఠ గోపం పెట్టి స్వంత ఆస్తిలా అనుభవిస్తున్న మీరు తనపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. లోకల్‌గా దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారని ఎక్కడ అన్యాయం జరుగుతందో దమ్ముంటే చూపాలని అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తానేమి అక్రమాలను సమర్ధించే ప్రసక్తి లేదన్నారు. ఇటీవలే దేవాదాయ శాఖలో ఒక అధికారి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి తెస్తే సంబందిత మంత్రికి ఫిర్యాదు చేయించి చర్యలు తీసుకున్నామే తప్ప మీలా అక్రమాలకు పాల్పడిన వారిని వెనుకేసుకుని రాలేదని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అవసరమైన సహజ వనరులు నిబంధనల మేరకు భూమి యాజమానుల నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండన్న సంవత్సరాల్లో పల్లెల్లో పండుగ వాతావారణం నెలకొందని తెలిపారు. సిమెంట్‌ రహదారులు, పొలాలకు దారులు, మంచినీటి పథకాలు, సాగు నీటి చెరువుల అభివృద్ధి శర వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. గూడూరు పురపాలక సంఘంలోనే రూ.100 కోట్ల పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైసిపి నాయకులు ఆరోపణలు మాని అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి అధికారులు, కమిషనర్‌ మల్లిఖార్జున్‌రావు, తెలుగుదేశం నాయకులు తానంకి నానాజి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, శీలం కిరణ్‌కుమార్‌, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బిల్లు చెంచురామయ్య, మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లురాజు, అధికార ప్రతినిధి అబ్దుల్‌రహీం, చంద్రమౌళినాయుడు, మట్టం శ్రావణి, గుండాల భాతరమ్మ, సోమిశెట్టి చెంచురామయ్య, పెంచలయ్య, చిల్లకూరు పట్టాభిరెడ్డి, కొండా రామచంద్రారెడ్డి, బిజెపి నాయకులు బాలకృష్ణమనాయుడు, కె దయాకర్‌, జనసేన నాయకులు మోహన్‌, పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.