అబ్దుల్ మస్తాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
నెల్లూరు, మేజర్ న్యూస్ : వైసిపి మైనారిటి నాయకులు అబ్దుల్ మస్తాన్ ని పోలీసులు అక్రమ అరెస్టు చేయడంతో.. నెల్లూరు కోటమిట్ట 42వ డివిజన్ లో అబ్దుల్ మస్తాన్ గారి.. నివాసానికి మైనార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చేరుకుని.. అబ్దుల్ మస్తాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్బంగా అధైర్య పడవద్దని.. పార్టీ అండగా ఉంటుందని అబ్దుల్ మస్తాన్ కుటుంబ సభ్యులకు చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. అబ్దుల్ మస్తాన్ ని.. బయటికి తీసుకొచ్చేందుకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని..ధైర్యంగా ఉండాలని వారికి భరోసానిచ్చారు.