ఆటోలో మరిచిపోయిన రెండు తులాల బంగారం స్వాధీనం
కంకిపాడు, మేజర్ న్యూస్ : ఆటోలో మరిచిపోయిన రెండు తులాల బంగారు ఆభరణాలను కంకిపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. అద్దంకి భాగ్యలక్ష్మి నవంబర్ 6న దుర్గమ్మ దర్శనం అనంతరం ఈడుపుగల్లు నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు గోశాల సెంటర్ వద్ద ఆటో ఎక్కారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద దిగే సమయంలో ఒక తులం బంగారు గాజులు, ఒక తులం బంగారు మాల, రెండు మురుగులు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయారు. ఆమె ఫిర్యాదుతో వెంటనే స్పందించిన కంకిపాడు ఎస్ఐ దాస్ విచారణ చేపట్టి ఆటో డ్రైవర్ వద్ద ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితురాలికి తిరిగి అందజేయడంతో ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.