ఆత్మకూరులో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ --పత్రాలు లేని 20 స్కూటర్లు, నాలుగు ఆటోలు స్వాధీనం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని ఎరుకులసాని నగర్‌లో శుక్రవారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ టీ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ గంగాధర్, ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్, అనంతసాగరం ఎస్సై రాజేష్‌తో పాటు 40 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని ఇళ్లను, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసిన పోలీసులు, సరైన పత్రాలు లేని 20 స్కూటర్లు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రజలకు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మొబైల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చట్టాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.