ఆత్మకూరు జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి నామినేషన్ దాఖలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతుతో ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.