BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి — ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు యూనియన్‌ వినతి

Select Suryaa Now
ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి — ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు యూనియన్‌ వినతి

గాజువాక, అక్టోబర్ 6, మేజర్ న్యూస్ : గత 20 ఏళ్లుగా వైద్యారోగ్య శాఖలో సేవలందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారికి కనీస వేతనాలు చెల్లించాలని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గాజువాకలోని తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి యూనియన్‌ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. గత ఏడేళ్లుగా వేతనాలు పెంచకపోవడంతో పెరుగుతున్న ధరల నేపథ్యంలో కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేల గౌరవ వేతనంలో ఆసుపత్రులు, పీహెచ్‌సీల రాకపోకలకే రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతోందని వివరించారు.

​ఆశా వర్కర్లను పర్మనెంట్‌ చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం, మెటర్నిటీ తదితర సెలవులు వర్తింపజేయాలని నాయకులు కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచి పనిభారాన్ని తగ్గించాలని, శిక్షణ పొందిన ఏఎన్‌ఎం, జీఎన్‌ఎంలకు శాశ్వత పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్‌ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.