BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Select Suryaa Now
ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

చీపురుపల్లి మేజర్ న్యూస్: 

ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సిటు రాష్ట్ర కమిటీలో పిలుపుతో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులకు స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చెయ్యాలని వినతిపత్రం ఇచ్చారు. అందులో భాగంగానే చీపురుపల్లి నియోజకవర్గంలో ఆశ కార్యకర్తలు ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసి వినతి ఇచ్చేందుకు ఆయన కార్యాలయానికి చేరుకొని  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సిటు నాయకులు ఏ గౌరి నాయుడు, విహెచ్ వెంకటేష్, ఆశ వర్కర్ల నాయకులు ఎమ్ గౌరి  మాట్లాడుతూ గతంలో ఆశా లు చలో విజయవాడలో కార్యక్రమం అనంతరం ప్రభుత్వo చర్చల్లో భాగంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని కోరారు. కనిసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, టీ ఏ, డి ఏ లాంటి సౌకర్యాలు కల్పించాలని, మరణించిన వారికి రూ.10 లక్షలు భీమా సౌకర్యం కల్పించాలని, ఇతర హామీల అమలుచేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు పి అనసూయ, జి గౌరి, కె కల్యాణి, కె లక్ష్మీ,   ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.