BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఆరిలోవ వైన్ షాప్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ.... నలుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్‌

Select Suryaa Now
ఆరిలోవ వైన్ షాప్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ.... నలుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్‌

ఆరిలోవ, సూర్య : ఆరిలోవ లాస్ట్ బస్ స్టాప్ సమీపంలో ఉన్న  ఎస్ కె ఎం ఎల్ వైన్ షాప్ వద్ద ఈ నెల 11న మధ్యాహ్నం  ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఆరిలోవ ప్రాంతానికి చెందిన ముల్లి దినేష్‌కు, అదే ప్రాంతానికి చెందిన పిన్నింటి సుధీర్, రాజోలు సుధాకర్, కొప్పర వంశీ, కందిస మోహన్‌లకు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వైన్ షాప్ మొదటి అంతస్తులో ఇరు వర్గాలు బీరు బాటిళ్లతో పరస్పరం దాడి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనలో ముల్లి దినేష్ బీరు బాటిల్‌తో రాజోలు సుధాకర్, కొప్పర వంశీలపై దాడి చేయగా, అనంతరం మిగిలిన నలుగురు కలిసి ముల్లి దినేష్‌పై బీరు బాటిళ్లు, విరిగిన తలుపు ముక్కతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో ముల్లి దినేష్‌కు తలపై మరియు శరీరంపై రక్తగాయాలు కాగా, రాజోలు సుధాకర్, కొప్పర వంశీలకు కూడా తలపై రక్తగాయాలయ్యాయి.ఈ ఘటనపై ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. శ్రీనివాస్  క్రైమ్ నంబర్  291/2026, సెక్షన్లు 109(1), 126(2) r/w 3(5) BNS నమోదు చేసి, ముల్లి దినేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులో నిందితులుగా ఉన్న పిన్నింటి సుధీర్, రాజోలు సుధాకర్, కొప్పర వంశీ, కందిస మోహన్‌లను  దర్యాప్తు చేసిన  ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హెచ్. వరహాల నాయుడు  అరెస్ట్ చేసి, తదుపరి న్యాయపరమైన చర్యల్లో భాగంగా రిమాండ్‌కు తరలించినట్లు  ఆరిలోవ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్.  శ్రీనివాస్ తెలిపారు.

రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.