BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

ఆలయాలకు కార్తీక్ శోభ

Select Suryaa Now
ఆలయాలకు కార్తీక్ శోభ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంబిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని ప్రముఖ దేవాలయాలకు కార్తీక మాసం సందడి ఏర్పడింది ముఖ్యంగా అయినవిల్లి గ్రామంలో వేంచేసి ఉన్న  స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిత్యం వేలాదిగా  భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయం చుట్టుపక్కల భక్తులతో కిటకిటలాడుతుంది ఈ ఆలయంలో నిత్యాన్నదానం నిర్విఘ్నంగా కొనసాగటం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు  అన్నప్రసాదాలు స్వీకరించి తృప్తి చెందుతున్నారు భక్తుల విరాళాల ద్వారా వచ్చిన సొమ్ముతో దేవస్థానం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కార్తీక మాసం పర్వదినం నెల రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు యాత్రికులు నిత్యం వస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారు శ్రీ విశ్వేశ్వర స్వామి వారు అన్నపూర్ణ దేవి ఆలయాలు నెలకొని ఉండటంతో భక్తులు తరిస్తున్నారు

 శ్రీరామచంద్రమూర్తిసే ప్రతిష్టించబడిన ముక్తేశ్వరం శ్రీముక్తి కాంతా సమేత క్షణముక్తేశ్వర స్వామి వారు  ఆలయం కార్తీకమాసం పర్వదినాల నెల రోజులు లక్ష బిల్వార్చనలతో మార్మోగుతుంది శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయం ధనలక్ష్మి అమ్మవారు ఉండటం ఆలయం ప్రత్యేకత అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయం శ్రీముక్తి కాంత క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయం పురాతన దేవాలయాలు కావటం ఈ ప్రాంతం దివ్య క్షేత్రాలుగా కొలబడుతుంది శ్రీముక్తి కాంత క్షణం ముక్తేశ్వర స్వామి వారి ఆలయం ద్వారా ఈ ప్రాంతానికి ముక్తేశ్వరం అనే పేరు వచ్చింది గౌతమి గోదావరి నది ఒడ్డున గల ఈ ఆలయాలు నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి  దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయాల నిర్వహణ జరుగుతుంది