BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

6, 7, 8 తేదీల్లో సేవా సేతు అభియాన్ క్యాంపులు

Select Suryaa Now
6, 7, 8 తేదీల్లో సేవా సేతు అభియాన్ క్యాంపులు

విజయవాడ,  మేజర్ న్యూస్ : ఏపీసీపీడీసీఎల్ పరిధిలో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో ‘సేవా సేతు అభియాన్’ క్యాంపులు నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ పి.పుల్లారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా నిర్వహించే ఈ క్యాంపుల్లో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ పొందే ప్రక్రియ, సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, నెట్ మీటరింగ్ తదితర అంశాలపై పూర్తి సమాచారం అందించనున్నారు. అర్హత కలిగిన గృహ వినియోగదారులకు 1 కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని సీఎండీ తెలిపారు. క్యాంపుల్లో బ్యాంకర్లు, సోలార్ విక్రేతలు, ఏపీసీపీడీసీఎల్ అధికారులు పాల్గొని వినియోగదారుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించవచ్చని, అర్హత ఉన్న ప్రతి గృహ వినియోగదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుల్లారెడ్డి కోరారు. పథకం లేదా క్యాంపులకు సంబంధించి సందేహాలుంటే ఏపీసీపీడీసీఎల్ 1912 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.