54 వ వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తా కూటమి అభ్యర్థి పరశురామరాజు
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 54వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేయడం జరుగుతుందని కూటమి అభ్యర్థి పరశురామరాజు తెలిపారు. వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్ మహాశయులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.