23వ డివిజన్‌లో కూటమి ఇంటింటి ప్రచారం
అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లకు విజ్ఞప్తి
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు పాత 23వ డివిజన్‌లో కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు సమన్వయంతో ప్రతి ఇంటికీ వెళ్లి స్థానికులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రానున్న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు. గత రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి స్థానికులకు వివరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా మౌలిక వసతుల మెరుగుదలకు జరుగుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు నాయకులు తెలిపారు. డివిజన్‌లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటి ప్రచారం కొనసాగించారు. ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాస రెడ్డి, నన్నం శ్రీనివాసులు, మేకల మధు, పుల్లా రెడ్డి, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.