BREAKING
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి: తమ్మినేని సూర్యనారాయణ(సీపీఎం) విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి: 2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా బ్యూరో, ఎల్.కోటలో వైభవంగా దేవీ నవరాత్రులు, శ్రీ వెంకటేశ్వర దివ్యోత్సవాలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల దంపతులు గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు! కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అత్యంత వైభవోపేతంగా దేవి నవరాత్రులు దేశంలో ఓట్ల తొలగింపు అనేది అప్రజాస్వామికం-తెలంగాణ అమరేందర్ రెడ్డి మంచి మనసుంటే చాలు... అధికారమే ఉండాల్సిన అవసరం లేదు ఆదిలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం శరన్నవరాత్రి ప్రారంభ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను విజయ వంతం చేయండి. ముప్పవరం సాయిబాబా గుడిలో ఘనంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు. కడ్తాల్ మండలానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కుంగ్ ఫూ విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు. ఇంకొల్లులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం.

13 కోట్ల ఓట్ల తొలగింపుపై సీఐటీయూ ఆగ్రహం..రాస్తారోకో! ఎన్నికల కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి.. ప్రధాని రాజీనామా చేయాలి: సీఐటీయూ డిమాండ్

Select Suryaa Now
13 కోట్ల ఓట్ల తొలగింపుపై సీఐటీయూ ఆగ్రహం..రాస్తారోకో!  ఎన్నికల కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి..  ప్రధాని రాజీనామా చేయాలి: సీఐటీయూ డిమాండ్

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం టీబీ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకోను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ప్రజల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, ఓటు హక్కును కోల్పోవడం ద్వారా ప్రజలు తమ ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని, ఎన్నికల కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావుండకూడదని అన్నారు. ఈవీఎంల సాఫ్ట్‌వేర్‌ను మార్చి బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడేలా చేశారంటూ అధికార పార్టీపై ఆరోపణలు చేశారు. ప్రజలు ఈ అంశాలన్నింటినీ గమనిస్తున్నారని, ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమిస్తున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల కమిషనర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో సీఐటీయూ నాయకులు కే. సాల్మన్, ఎం. చంటి, రాఘవ, ఓబులేష్, బాలసుబ్బయ్య, ఐద్వా అధ్యక్షురాలు విజయమ్మ, డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడు మేరీ బాబు, దినేష్, వినీత్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై నిరసన తెలిపారు.

  • ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా