12న ఒంగోలులో జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విద్యార్థి సయ్యద్ తౌషిక్, అతని తల్లి మౌలాబి ప్రేరేపిత ఆత్మహత్యలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇంకొల్లు లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాల రాజకీయ పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు.