BREAKING
నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్!

12,13 తేదీలలోమున్సిపాలిటి వార్డులలోసమావేశాలు నిర్వహించనున్న పెద్దిరెడ్డి

Select Suryaa Now
12,13 తేదీలలోమున్సిపాలిటి వార్డులలోసమావేశాలు నిర్వహించనున్న పెద్దిరెడ్డి

పుంగనూరు  :

వైఎస్సార్‌సిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌,ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 12,13 తేదీలలో రెండు రోజుల పాటు పుంగనూరు మున్సిపాలిటి వార్డులలోసమావేశాలునిర్వహిస్తారని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా శనివారం రాత్రి విలేకరులకు తెలిపారు.మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను చైతన్యపరిచేందుకు వార్డు సమావేశాలను పెద్దిరెడ్డి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 12న ఉదయం9గంటలకుహనుమంతరాయునిదిన్నె లో గల ఫ్రెండ్స్ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహిస్తారు. 11 గంటలకు మొదలియార్ల ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహిస్తారు. 12:30 గంటలకు నక్కబండలో సమావేశం జరుగుతుంది. 2:30 గంటలకు అంజుమన్‌ షాదీమహాల్‌లో , 3:30 గంటలకు రహమత్‌ నగర్‌లోని టిప్పుసర్కిల్‌లో సమావేశం జరుగుతుంది. అలాగే 13న ఉదయం జెఎండి ఫంక్షన్‌హాల్‌, 10:30 గంటలకు గాండ్ల ఫంక్షన్‌హాల్‌లో సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశాలను జయప్రదం చేసేందుకు వైఎస్సార్‌సిపి పార్టీ అభిమానులు, పెద్దిరెడ్డి అభిమానులు, ఆయా వార్డు మెంబర్లు, కార్యకర్తలు , మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దిరెడ్డి సభలను జయప్రదం చేయాలని కోరారు.

రెడ్డి గౌరీ రెడ్డప్ప సూర్య రిపోర్టర్ పుంగనూరు అన్నమయ్య జిల్లా