11వ తేది నుంచి శరన్నవరాత్రులు
నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలోని తెలుగుపేటలో వెలసిన ఘన మద్దులేటి లక్ష్మీ నృసింహా స్వామి సమన్విత
నవ నారసింహుల దేవస్థానంలో ఈనెల 11వ తేది నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.
నిర్వాహకులు మాట్లాడుతూ అక్టోబర్ 11వ తేదీన ఆదివారం నుంచి 20వ తేదీన మంగళవారం వరకు శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఆలయ లో ప్రత్యేక అలంకరణ లో
శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారి అష్ట స్వరూపాలు అయిన
అష్టలక్ష్మీల స్వరూపాలలో ఒక్కొక్క రోజు ఒక్క అమ్మ వారి అలంకరణ లో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నారు.
అష్టలక్ష్మీ అలంకరణ వివరాలు ఇలా ఉన్నాయన్నారు.
11వ తేదీన ఆదివారం - ఆదిలక్ష్మీ.
12వ తేదీన సోమవారం - వీరిలక్ష్మీ.
13వ తేదీన మంగళవారం - ధనలక్ష్మీ.
14వ తేదీన బుధవారం - సంతానలక్ష్మీ.
15వ తేదీన గురువారం - జయలక్ష్మీ.
16వ తేదీన శుక్రవారం -
విద్యాలక్ష్మీ.
17వ తేదీన శనివారం -
ధాన్యలక్ష్మీ.
18వ తేదీన ఆదివారం - ధైర్యలక్ష్మీ
19వ తేదీన సోమవారం -
రాజ్యలక్ష్మీ.
20వ తేదీన మంగళవారం శమీ దర్శనం ఉంటుందన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంకాలం అమ్మ వారి కి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
భక్తులు మీకు వీలైన రోజున అమ్మవారి అలంకరణ రోజున ఉభయకర్తలుగా పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.