|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 05:40 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువ రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకుడు పిన్నింటి విజయ్ కుమార్ రాసిన వ్యాసాల సంకలనం ‘నా ఆలోచనలు’ పుస్తకాన్ని ఆయన తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పుస్తక పఠనం అలవాటు తగ్గిపోతున్న ప్రస్తుత కాలంలో విజయ్ కుమార్ వంటి యువకులు పుస్తకాలు రాయడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రాంతీయ, జాతీయ అంశాలపై విజయ్ కుమార్‌కు మంచి అవగాహన ఉందని, ఆయన వ్యాసాల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. గొప్ప సామాజిక స్పృహతో, కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో రాసిన ఈ వ్యాసాల సంకలనాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.