|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 09:09 AM
వెంగళరావు నగర్ లో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకర్ ను హైడ్రా శుక్రవారం తొలగించింది. వెంగళరావు నగర్ డి టైప్ కాలనీలో 1974లో దీనిని నిర్మించారు. యిలా దశాబ్దాలపాటు వెంగళరావు నగర్ కాలనీ ప్రజలకు తగు నీరందించింది. అయితే మూడు దశాబ్దాలుగా వినియోగంలో లేదు. కూలడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఎవరి ప్రాణాలకు ముప్పో అనేట్టు ప్రమాదకరంగా మారింది. దీనిని భద్రంగా తొలగించమని పలుమార్లు సంబంధిత అధికారులకు కాలనీ వాసులు ఫిర్యాదు చేసారు. చివరికి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం జాగ్రత్తగా కూల్చివేసింది. ఎలాంటి ప్రమాదానికి ఆస్కారం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంది. గురువారమే దగ్గరలో ఉన్న నివాసితులు ను అప్రమత్తం చేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూల్చివేసింది. ఈ 200ల గజాల స్థలాన్ని ప్రజావసరాల కు వినియోగించే విధంగా చూస్తామని స్థానికులు తెలిపారు.