|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 09:46 PM
తెలంగాణలో BRS పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై BRS పార్టీ ఫిరాయింపుగా పరిగణించి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ వద్ద దాఖలు చేసింది. అయితే, స్పీకర్ ఈ పిటిషన్లపై చర్య తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ BRS నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఆ పిటిషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక మార్లు విచారణ నిర్వహించింది. ఎమ్మెల్యేల అనర్హతపై తుదితీర్పు రేపు (జులై 31) వెలువడనుంది. ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాక సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై గెలిచినప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపటితో తేలనుంది. సుప్రీం తీర్పును ఎదురుచూస్తూ ఆ ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తీర్పు రేపు ఉదయం వెలువడే అవకాశం ఉంది.