|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 09:54 PM
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కు చెందిన యూరాలజీ విభాగం సర్జరీ రంగంలో మరింత ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతోంది. 1989లో విభాగం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు, నిమ్స్ మూత్రపిండ మార్పిడి (కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్) శస్త్రచికిత్సలకు నమ్మకమైన చిరునామాగా నిలిచింది. దీర్ఘకాల అనుభవం, అంకితభావం కలిగిన వైద్య సిబ్బంది, ఆధునిక సాంకేతికత కలగలిసి ఈ విభాగాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి తీసుకొచ్చాయి.NIMS అరుదైన రికార్డు 6 నెలల్లో 100 కిడ్నీ మార్పిడి (Kidney Transplant) శస్త్రచికిత్సలు విజయవంతం!హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్ (NIMS) మరో ఘనత సాధించింది. గడచిన 6 నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడీ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఒక అరుదైన రికార్డును నమోదు 6 నెలలు (సుమారుగా 2025 జనవరి – జూన్ మధ్య) చేసింది.2015లో సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. సి. రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్‌ల బృందం గత పదేళ్లలో 1000కి పైగా కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యంగా గత ఆరు నెలల్లోనే 100 మార్పిడులు చేయడం గమనార్హం.ప్రతి సంవత్సరం 100కి పైగా మార్పిడులు చేస్తూ, గత రెండేళ్లుగా ఈ సంఖ్య మరింత పెరిగింది. నిమ్స్ దేశంలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసే మూడవ అగ్రశ్రేణి సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. రోబోటిక్ సిస్టమ్ లభ్యతతో సాంకేతికంగా ముందంజలో ఉండి, ఇప్పటివరకు 4 రోబోటిక్ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసింది. కిడ్నీ మార్పిడులతో పాటు, ఇదే బృందం ప్రతి నెలా 1000కి పైగా ఇతర శస్త్రచికిత్సలు నిర్వహిస్తోంది. అంటే సంవత్సరానికి 12,000కు పైగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అలాగే గత రెండేళ్లలో 350కి పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.ఈ అసాధారణ విజయాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. రామ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజా నరసింహకు, నిమ్స్ డైరెక్టర్ డా. ఎన్. భీరప్పకు కృతజ్ఞతలు తెలిపారు. “ఇది ఒక గొప్ప మైలురాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో వేగంగా, సురక్షితంగా ఇన్ని శస్త్రచికిత్సలు చేయడం గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని అవయవ మార్పిడులు చేయడం లక్ష్యం.”ఈ ఘనతలు నిమ్స్ యూరాలజీ విభాగం నిబద్ధత, నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి.