|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:44 PM
బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతున్న మాటలు బాధాకరమని అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి గతంలోనే పంపించినప్పటికీ రాష్ట్రపతి వద్ద పెండింగులో పెట్టి తిరిగి పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బిల్లుకు మతపరమైన రంగు పులిమి బీజేపీ బిల్లును పాస్ చేయడం లేదని విమర్శించారు. గుజరాత్‌లో ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చారో అందరికీ తెలుసని, తెలంగాణ విషయంలో మాత్రం బీజేపీ మరో రకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ 50 శాతానికి పైగా రిజర్వేషన్లను అమలు చేస్తోందని కవిత వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి న్యాయస్థానాల పరిధిలో ఉందని సాకులు చెబుతోందని విమర్శించారు. బీసీ బిడ్డలను రిజర్వేషన్లకు దూరంగా ఉంచాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.