|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:41 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీకి వెళుతున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి గట్టిగా మాట్లాడాలని సూచించారు.హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, అయితే బీసీలు పార్టీల పరంగా రిజర్వేషన్లు కోరుకోవడం లేదని తెలిపారు. చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను వారు కోరుకుంటున్నారని తెలిపారు. రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బీసీ బిడ్డలు వారిని వదిలి పెట్టరని హెచ్చరించారు.