|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:36 PM
పార్టీ కార్యకలాపాలకు తనను దూరం పెడుతున్నారని చెప్పడానికి మురళీధరన్‌కు పార్టీలో ఏం అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఆయన తీరుపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో, పార్టీ కార్యకలాపాలకు శశిథరూర్‌ను దూరం పెడుతున్నామని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మురళీధరన్ అన్నారు.మురళీధరన్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాదనలు చేయడానికి వారి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటని నిలదీశారు. తనపై అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి పార్టీలో ఏం అధికారం ఉందో చెప్పాలని శశిథరూర్ అన్నారు. కొంతమంది ఎలాంటి ఆధారాలు లేకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటి వాటికి స్పందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వేరే వాళ్ల గురించి తనను అడగవద్దని, తన గురించి మాత్రమే తాను మాట్లాడతానని శశిథరూర్ స్పష్టం చేశారు.