|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 03:43 PM
జీవో 49ని రద్దు చేయాలని ఆదివాసీ, తుడుందెబ్బ సంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆసిఫాబాద్‌లో ఆదివాసీ, ఇతర సంఘాల నాయకులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. కాగజ్‌నగర్‌లో ర్యాలీ తీశారు. మిగతా మండలాల్లో ఆదివాసీ, తుడుందెబ్బ నాయకులు నిరసనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివాసీ, గిరిజన సంఘాలు రాస్తారోకో చేపట్టాయి. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నెన్నెలలో జీవో ప్రతులను దహనం చేశారు. కాసిపేట మండలంలో బంద్ నడిచింది. ఆదిలాబాద్‌లో ప్రధాన వీధుల గుండా ఆదివాసీ నేతలు ర్యాలీలు నిర్వహించి దుకాణాలను మూసి వేయించారు. బస్టాండ్, బస్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. గుడిహత్నూర్, ఉట్నూర్ మండల కేంద్రాల్లో వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి.