|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 10:38 AM
రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ నిబంధనను తీసుకువచ్చింది.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే, రెట్టింపు జరిమానా విధించనున్నారు. ఈ నిబంధన జులై 20 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం, పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, డ్రైవర్లు మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు సూచిస్తున్నారు. సీట్ బెల్ట్ ధరించకపోవడం, స్పీడ్ లిమిట్ దాటడం, లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం వంటి నియమ ఉల్లంఘనలకు సాధారణ జరిమానాతో పాటు అదనంగా రెట్టింపు జరిమానా విధించబడుతుంది. ఉదాహరణకు, సాధారణంగా రూ.1000 జరిమానా ఉండే ఉల్లంఘనకు, పిల్లలు వాహనంలో ఉంటే రూ.2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఈ చర్య ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ముఖ్యంగా పిల్లల భద్రతను కాపాడడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. డ్రైవర్లు ఈ నిబంధనను గమనించి, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు.