|
|
by Suryaa Desk | Sat, Jul 19, 2025, 09:06 PM
హైదరాబాద్ నగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విద్యానగర్, నల్లకుంట, సికింద్రాబాద్, జవహర్ నగర్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, కూకట్‌పల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపైకి నీరు చేరింది.దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట-లింగంపల్లి మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బేగంపేట ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ నిలిచిపోయింది.