|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 11:24 AM
హైదరాబాద్ నగరంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాంకో హిల్స్‌లో ఓ యువకుడు మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వాలివేటి హితేష్ (29) అనే యువకుడు గురువారం ఉదయం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు.హితేష్ తన తమ్ముడు ప్రమోద్, ఇద్దరు స్నేహితులతో కలిసి ల్యాంకో హిల్స్‌లో ఉంటున్నాడు. ఈ రోజు మిగతావారు బయటకు వెళ్లగా, హితేష్ ఒంటరిగా ఉండిపోయాడు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన తమ్ముడు ప్రమోద్, తమ స్నేహితుడు చిరంజీవిని అక్కడికి పంపించాడు. అయితే.. ఇంటి తలుపు తీయకపోవడంతో లాక్ తీసి లోపలికి వెళ్లగా హితేష్ ఉరి వేసుకొని మరణించి ఉండటం గుర్తించారు. స్థానికుల సాయంతో వెంటనే దింపినా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది.హితేష్ గతంలో ఓ యువతిని ప్రేమించి ఇటీవల ఆమెతో విరహం చెంది మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని సమాచారం. ఆ ఒత్తిడితోనే అతడు ఈ అఘాతక నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని సోదరుడు ప్రమోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.