![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 10:57 AM
పెద్దపెల్లి జిల్లాలో బుధవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, సీతక్కల పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎలిగేడు మండలంలో ఆయా పార్టీల నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం పట్ల బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఖండించారు.