|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 01:06 PM
బంగారం ధరలు ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి పసిడి ధర ఏకంగా 7 శాతం మేర క్షీణించింది. అమెరికాలో వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గడం, వాణిజ్య యుద్ధ భయాలు సన్నగిల్లడం వంటి కారణాలతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ 22న 10 గ్రాముల బంగారం ధర రూ.99,358 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు ధర గణనీయంగా తగ్గింది. గత ఏడాది డిసెంబర్ తర్వాత తొలిసారిగా 50 రోజుల చలన సగటు (మూవింగ్ యావరేజ్) కంటే దిగువన ముగిసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బంగారం ధర 10 గ్రాములకు రూ.88,000 స్థాయికి పడిపోతే పెట్టుబడిదారులు ఎలాంటి వ్యూహం అనుసరించాలనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.