|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 08:27 PM
కోలీవుడ్ నటుడు శింబు తన తదుపరి చిత్రాన్ని వెట్రీ మరాన్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది సింబు యొక్క 49వ చిత్రంగా ఉంటుంది. ఈ చిత్రం ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన వాడా చెన్నై కి సీక్వెల్ అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఇది నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్ ఆధారంగా గ్యాంగ్‌స్టర్ డ్రామా అవుతుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Latest News