BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

యువతకు కాంగ్రెస్‌ పెద్దపీట.. రాకేష్‌రెడ్డికి కీలక పగ్గాలు

Select Suryaa Now
యువతకు కాంగ్రెస్‌ పెద్దపీట.. రాకేష్‌రెడ్డికి కీలక పగ్గాలు

ఏదులాపురం మున్సిపాలిటీ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక

ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : విద్యావంతులైన యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ కాంగ్రెస్‌ పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. ఇందులో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్‌ యువజన అధ్యక్షుడిగా 28వ వార్డుకు చెందిన గుర్రం రాకేష్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆదివారం 31వ వార్డులోని జీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన 32 వార్డుల కాంగ్రెస్‌ కమిటీల నియామక కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బానోతు కిషోర్‌ నాయక్‌ రాకేష్‌రెడ్డి నియామకాన్ని ప్రకటించారు. ఎంఏ, బీఈడీ ఉన్నత విద్యార్హతలు కలిగిన రాకేష్‌రెడ్డికి యువజన కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

యువతను సంఘటితం చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

ఈ సందర్భంగా రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతను సంఘటితం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో యువతను భాగస్వాములను చేస్తానని, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రాకేష్‌రెడ్డి నియామకం పట్ల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు అభినందనలు తెలిపారు. ఉన్నత విద్యార్హతలు కలిగిన యువకుడికి కీలక బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో యువతకు ప్రాధాన్యత పెరిగిందని, రాకేష్‌రెడ్డి నాయకత్వంలో యువజన కాంగ్రెస్‌ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.