BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

వినాయక్ సాగర్, మహాలక్ష్మి ఆలయ పరిసరాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి

Select Suryaa Now
వినాయక్ సాగర్, మహాలక్ష్మి ఆలయ పరిసరాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి

సూర్య నిర్మల్ ప్రతినిధి:దసరా, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా నిర్మల్ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ వైస్‌ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. వినాయక్ సాగర్, మహాలక్ష్మి ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.వినాయక్ సాగర్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి క్రేన్‌, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి ఆలయం వద్ద శమీ పూజ, రావణ దహన కార్యక్రమాల వీక్షణకు బారికేడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
దసరా రోజున ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని కాలినడకన, ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు గాంధీ చౌక్‌, విశ్వనాథ్‌పేట్ మార్గంలో, నాలుగు చక్రాల వాహనాలు, ఆటోల్లో వచ్చేవారు కలెక్టరేట్ మార్గంలో రావాలని సూచించారు. ప్రజలు అధికారులకు సహకరించి పండుగలను ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెండం శ్రీనివాస్, శ్రీరామోజీ నరేష్, గుంజాల లక్ష్మి చైతన్య, లక్కాకుల హరీష్, మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య, ఆలయ కమిటీ చైర్మన్ తాళ్ల రాజు, మాజీ చైర్మన్ కుడుకల గంగాధర్, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.