BREAKING
ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ...... నగరంలో కూటమి ప్రచార బేరి ఓటమి భయంతోనే విధ్వంస రాజకీయాలు -రూ.4.75 కోట్ల రోడ్డును అర్ధరాత్రి ధ్వంసం - ఇది అభివృద్ధిపై దాడి కాదా? -పులివెందుల పులి తోక కట్-నీ ఇలాకా కూడా కూటమి వశమే జగన్ టాబ్లెట్లు వేసుకోకుండా ఎవరిని సస్పెండ్ చేస్తాడో? వైసీపీపై కిరణ్ రాయల్ సంచలన ధ్వజం

విద్యుత్ షాక్‌తో గ్రామపంచాయతీ వర్కర్ మృతి * కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పనుల వద్ద విషాద ఘటన

Select Suryaa Now
విద్యుత్ షాక్‌తో గ్రామపంచాయతీ వర్కర్ మృతి * కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పనుల వద్ద విషాద ఘటన

విద్యుత్ షాక్‌కు గురై గ్రామపంచాయతీ వర్కర్ మృతి చెందిన విషాద ఘటన ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వెల్టూర్ గ్రామపంచాయతీలో వర్కర్‌గా పనిచేస్తున్న ఎడ్ల నిరంజన్ (45) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ పనుల్లో పాల్గొన్నారు.ట్రాన్స్‌ఫార్మర్‌ను దిమ్మెపై అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో నిరంజన్ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సిబ్బంది డిండి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.మృతుడికి భార్య జంగమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరంజన్ మృతితో వెల్టూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం, గ్రామపంచాయతీ ఆదుకుని తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గణేష్ గౌడ్,  ఉప్పునుంతల, సూర్య న్యూస్