BREAKING
ప్రజల నమ్మకమే నా బలం: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ విజయదశమి వేడుకలు.. వైభవంగా దుర్గాదేవి నిమజ్జనోత్సవం! స్త్రీ శక్తి కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు అన్నదానం, సాంస్కృతిక వైసీపీ కార్యకర్త అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన మాజీ జెడ్పీటీసీ లోకేష్ వాసవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 21వ వార్డు జనసేన అభ్యర్థి అబ్బీస్ ప్రచారం ముమ్మరం భారీగా నగదు స్వాధీనం- డి.ఎస్.పి రామాంజి నాయక్ 34 ఏళ్ల జర్నలిజానికి స్వస్తి.. జనసేనలో చేరిన సీనియర్ జర్నలిస్ట్ మండేల బాబి ఇద్దరు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థుల ఖరారు..కొత్తపేటకు బండారు రాజా..ఆత్రేయపురానికి కప్పల శ్రీధర్‌ వైభవంగా సాయిబాబా మహాసమాధి ఉత్సవం కొత్తూరులో వైభవంగా విజయదశమి వేడుకలు ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు. రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత.. మదనపల్లి అభివృద్ధికై డాక్టర్ అప్సర్ షరీఫ్ ని గెలిపించండ : డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పిలుపు బీరప్ప స్వామి ఆలయంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు కురుబ కులస్తుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు.. రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్

వేరుశనగ రైతులకు డీకార్టికేటర్‌ వరం * రైతుల శ్రమ, సమయం ఆదా చేయడమే లక్ష్యం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

Select Suryaa Now
వేరుశనగ రైతులకు డీకార్టికేటర్‌ వరం * రైతుల శ్రమ, సమయం ఆదా చేయడమే లక్ష్యం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

వేరుశనగ రైతులకు పంట అనంతర పనుల్లో డీకార్టికేటర్ యంత్రం ఎంతోఉపయోగకరంగా ఉంటుందని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. బుధవారం ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీకార్టికేటర్ యంత్రాన్ని అచ్చంపేట సబ్‌ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి ఆయన పరిశీలించారు.యంత్రం పనితీరు, సామర్థ్యం, వేరుశనగను శుభ్రపరిచి గింజలను వేరు చేసే విధానం, రైతులకు అందిస్తున్న సేవలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంట కోత అనంతరం గింజలను వేరు చేయడం, శుభ్రపరచడంలో రైతులకు గతంలో ఎక్కువ సమయం, శ్రమ అవసరమయ్యేదని, యాంత్రీకరణతో ఈ ప్రక్రియ సులభతరం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
డీకార్టికేటర్ యంత్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సమయం, శ్రమను ఆదా చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అద్దంకి సునీత , ఎంపీడీవో వరుణ్ తేజ్ ,పిఏసిఎస్ చైర్మన్ మధు నరేందర్ రెడ్డి, సీఈఓ కొత్త రవీందర్రావు , సర్పంచ్ చింతగల శ్రీనివాసులు, డిప్యూటీ తాసిల్దార్ రమేష్ నాయక్, మండల వ్యవసాయ అధికారి రమేష్ నాయక్ , వ్యవసాయ శాఖ, పీఏసీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 గణేష్ గౌడ్, ఉప్పునుంతల, సూర్య న్యూస్